అంచె: 1

మీకు సరిపోయే ఒక ప్యాకేజ్‌ని
ఎంచుకోండి.

అంచె: 2

లైసెన్స్/లాగిన్స్‌ను మార్గ్ నుండి కొనుగోలు చేయండి.

అంచె:3

మీ లాగిన్ ఐడిలోకి కస్టమైజ్ చేయబడిన నివేదికలు పొందండి.
మా ప్ర్రోగ్రామ్ వివరాల గురించి తెలుసుకోవడానికి

సమగ్ర విశ్లేషణ

శాస్త్రీయంగా అభివృద్ధి పరచబడిన మా పరీక్ష ఖచ్చితమైన ఫలితాలను మరియు భారతీయ నేపథ్యంలో విద్యార్థి యొక్క ప్రొఫైలింగ్‌ను అందజేస్తాయి.

భారతదేశానికి సరిపోయేలా తయారు చేయబడినది

మా పరీక్షల కంటెంట్ భారతీయ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడినది మరియు వివిధ భారతీయ భాషలలో లభ్యవుతుంది.

కౌన్సెలర్ డాష్‌బోర్డ్

సరిపోయే కెరీర్లకు, విద్యార్థి ప్రదర్శన, మరియు నివేదికలకు సులభ ప్రవేశం.

ఎక్కడినుండైనా/ఎప్పుడైనా పరీక్ష తీసుకోండి

మీ విద్యార్థులు మీ కౌన్సెలింగ్ సెంటర్ నుండి లేదా అధిక సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశముండే ఏ ప్రదేశం నుండైనా పరీక్షను తీసుకోవచ్చు.మార్గ్ నుండి లైసెన్స్/లాగిన్ తీసుకొనే ప్రక్రియ ఏమిటి?

మీరు "రిజిస్టర్ నౌ" ఫారం నింపాలి. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి మా బృంద సభ్యులు మిమ్మల్ని సంప్రదించి, మాతో భాగస్వామ్యం ఏర్పరచుకొనేందుకు తదుపరి చర్యల గురించి వివరిస్తారు. ఆతరువాత మేము మీ అవసరాలకు తగినట్లుగా పరీక్షను తయారుచేసి, మీకు, మీ బృందానికి లాగిన్ ఐడిలు తయారు చేస్తాము. మీరు మీ లాగిన్/లైసెన్సులను మీ అవసరాలకు తగినట్లుగా వాడుకోవచ్చు.
మార్గ్ పరీక్ష వ్యవధి ఎంత?

ఒక విద్యార్థికి పరీక్షపూర్తిచేయడానికి సుమారు 2.5 గంటల సమయం పడుతుంది. విద్యార్థి/కౌన్సెలర్ వారికి నిర్దేశించిన నివేదికను సాధారణంగా అదేరోజు పొందుతారు.
విద్యార్థులకు, కౌన్సెలర్లకు పరీక్షల నివేదిక ఎప్పుడు లభ్యమవుతుంది?
విద్యార్థి మరియు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పరీక్ష పూర్తిచేసిన రోజే నివేదిక పొందుతారు. కెరీర్ గైడెన్స్ నివేదిక విద్యార్థికి మరియు పాఠశాల కౌన్సెలర్‌కు పరీక్ష పూర్తిచేసిన తరువాత 6నెలల పాటు లభ్యమవుతుంది. మీకు నిర్ధారిత అవసరాలు ఏవైనా ఉంటే వాటిని లైసెన్స్ తీసుకొనే సమయంలో తెలియజేయవలసి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ ఏ తరగతులు/వయోగ్రూపులకు నిర్ధారించినది?

మార్గ్ పరీక్ష అనేది ప్రస్తుతం 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకోసం రూపకల్పన చేయబడినది. 11వ తరగతిలో సరైన మార్గం ఎంచుకొనేందుకు, వివిధ ఐఛ్ఛికాలను అన్వేషించడానికి విద్యార్థులకు ఇది సరైన సమయం.
మార్గ్ కెరీర్ అంచనా కార్యక్రమాన్ని ఎంచుకొనేందుకు చార్జీలు ఎంత ఉంటాయి?
మేము కెరీర్ గైడెన్స్ పరీక్షను పాఠశాల అవసరాలకు అనుగుణంగా తయారుచేస్తాము. అందువల్ల ధర అనేది మీరు తీసుకొనే ఉత్పత్తి యొక్క లక్షణాలపై ఆధారపడి మారుతుంది.Explore career options through our blogs