అంచె: 1

మార్గ్ నుండి లైసెన్స్/లాగిన్లు కొనుగోలు చేయడం

అంచె: 2

పరీక్షకు ఒక తేదీని ఎంచుకోవడం

అంచె:3

మీ పాఠశాల వద్ద పరీక్షనిర్వహణకై మార్గ్ ఒక బృందాన్ని నియోగిస్తుంది

నివేదిక

మీ లాగిన్ ఐడిలలో మీకనువుగా
ఉండే నివేదికలను పొందండి
మా ప్ర్రోగ్రామ్ వివరాల గురించి తెలుసుకోవడానికిపాఠశాల డాష్‌బోర్డ్

నమొదు చేసుకొన్న విద్యార్థులందరికీ కెరీర్ పోలికలు మరియు విద్యార్థుల పనితీరును సులభంగా పొందవచ్చు.

కెరీర్ కౌన్సెలర్

మీ పాఠశాలకు సంబంధించిన కెరీర్ మార్గదర్శక విభాగంలోని ఉపాధ్యాయులు/కౌన్సెలర్ వెంటనే ఉపయోగించే విధంగా నివేదిక.

విద్యార్థుల అభివృద్ధి అవసరాలు

విద్యార్థుల అభిరుచికి తగినట్లుగా తయారుచేయబడిన మాట్రిక్స్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు పిల్లల ఏరంగంలో నైపుణ్యం కలిగివున్నారు మరియు ఆయారంగాల్లో వారు ఎంతవరకు రాణించగలారు అన్నదాన్ని అంచనా వేయడానికి దోహదం చేస్తుంది.

నేర్చుకొన్న దాని అంచనా

మా పరీక్షలోని పాఠ్యాంశాల ఆధారిత విభాగం, విద్యార్థికి పాఠశాల స్థాయిలో నేర్పించబడే ప్రాథమిక అంశాలను వారు ఏమేరకు అర్థం చేసుకోగలిగారు అన్నదాన్ని అంచనావేయడానికి దోహదం చేస్తుంది. ఈ పరీక్ష యొక్క ఫలితాలను సిబ్బంది/ఉపాధ్యాయులకు అవసరమైనట్లయితే శిక్షణ ఇచ్చేందుకు వినియోగించుకోవచ్చు.సమగ్ర విశ్లేషణ

మా ప్లాట్‌ఫారం విద్యార్థులను పాఠ్యాంశ ఆధారిత పరిజ్ఞ్జానం, సహజ సామర్థ్యాలు, వ్యక్తిత్వం మరియు ఆసక్తిలవంటి భిన్నమైన అంశాలలో పరీక్ష చేస్తుంది. భారతీయ విద్యార్థులకు సంబంధించి ఇది ఎంతో సమగ్రమైన పరీక్షగా పరిగణించవచ్చు.

కెరీర్ ఐఛ్ఛికాన్ని ఎంచుకోగలగడం

మా సమగ్ర విశ్లేషణ వల్ల విద్యార్థి అతని/ఆమె అభిరుచి, పరిజ్ఞానం, మరియు సామర్థ్యాలకు తగినట్లుగా ఉత్తమ కెరీర్-ఫిట్‌మెంట్‌ను ఎంచుకొనేలా హామీ ఇస్తుంది.

సాధారణ నివేదికలు

మేము అందించే నివేదికలు ప్రస్తుతం 9 లేదా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్షల ఫలితాలు మరియు ఇవ్వబడిన సూచనలను సులభంగా అర్థం చేసుకొనే విధంగా ఉంటాయి.

ఉచిత కెరీర్ ఇన్వెంటరీ

విద్యార్థులు మా ఉచిత కెరీర్ ఇన్వెంటరీని కెరీర్ ఐఛ్ఛికాలను అన్వేషించేందుకు మరియు కెరీర్లపట్ల వారికి అవగాహన పెంపొందించుకొనేందుకు ఉపయోగించుకోవచ్చు.మార్గ్ నుండి లైసెన్స్ పొందే విధానమేమిటి?

మీరు "రిజిస్టర్ నౌ" ఫారం నింపాలి. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి మా బృంద సభ్యులు మిమ్మల్ని సంప్రదించి, మాతో భాగస్వామ్యం ఏర్పరచుకొనేందుకు తదుపరి చర్యల గురించి వివరిస్తారు. ఆతరువాత మేము మీ పాఠశాల అవసరాలకు తగినట్లుగా పరీక్షను తయారుచేసి, మీ విద్యార్థులకు, మీ పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు లాగిన్ ఐడిలు తయారు చేస్తాము. మీరు మీ లైసెన్సును మీ అవసరాలకు తగినట్లుగా వాడుకోవచ్చు.
మార్గ్ పరీక్ష వ్యవధి ఎంత?

ఒక విద్యార్థి పరీక్షను పూర్తిచేయడానికి సాధారణంగా 2.5 గంటల సమయం తీసుకొంటాడు. విద్యార్థి అతని/ఆమెకు సంబంధించిన నివేదిక సాధారణంగా అదేరోజు పొందుతారు.
విద్యార్థులకు, పాఠశాల అడ్మినిస్ట్రేటర్లకు పరీక్షల నివేదిక ఎప్పుడు లభ్యమవుతుంది?
విద్యార్థి మరియు పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పరీక్ష పూర్తిచేసిన రోజే నివేదిక పొందుతారు. కెరీర్ గైడెన్స్ నివేదిక విద్యార్థికి మరియు పాఠశాల కౌన్సెలర్‌కు పరీక్ష పూర్తిచేసిన తరువాత 6నెలల పాటు లభ్యమవుతుంది. మీకు నిర్ధారిత అవసరాలు ఏవైనా ఉంటే వాటిని లైసెన్స్ తీసుకొనే సమయంలో తెలియజేయవలసి ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ ఏ తరగతులకోసం నిర్ధారించినది?

మార్గ్ పరీక్ష అనేది ప్రస్తుతం 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకోసం రూపకల్పన చేయబడినది. 11వ తరగతిలో సరైన మార్గం ఎంచుకొనేందుకు, వివిధ ఐఛ్ఛికాలను అన్వేషించడానికి విద్యార్థులకు ఇది సరైన సమయం.
మార్గ్ కెరీర్ అంచనా కార్యక్రమాన్ని ఎంచుకొనేందుకు చార్జీలు ఎంత ఉంటాయి?
మేము కెరీర్ గైడెన్స్ పరీక్షను పాఠశాల అవసరాలకు అనుగుణంగా తయారుచేస్తాము. అందువల్ల ధర అనేది మీరు తీసుకొనే ఉత్పత్తి యొక్క లక్షణాలపై ఆధారపడి మారుతుంది.


Explore career options through our blogs