ఒక కెరీర్‌ను ఎంచుకోండి
మీ పనిని ఆస్వాదించండి
విజయం స్వంతం చేసుకోండి

పరీక్ష వివరాలు

 • • విభాగాలు: 4
 • • వ్యవధి: 2.5 గంటలు
 • • భాష ఐఛ్ఛికాలు: ఇంగ్లీష్/కన్నడ
 • • ఫీజు: రూ.1000 + పన్నులు

మీకు పరీక్ష దేనిపై ఉంటుంది

 • • పాఠ్యాంశం ఆధారిత పరీక్ష
 • • అవగాహన పరీక్ష
 • • కెరీర్ ఆసక్తి పరీక్ష
 • • వ్యక్తిత్వ పరీక్ష.

మీ నివేదిక

 • • ప్రతి విభాగాన్ని విశ్లేషిస్తూ కస్టమైజ్
 • • మీ ఆసక్తి మరియు నైపుణ్యాల ఆధారంగా మీకు
  సరిగ్గా సరిపోయేలా ౩ కెరీర్ ఐఛ్ఛికాలు.


పాఠ్యాంశ పరీక్ష:

ఈ పరీక్ష మీరు ఇంతవరకు పాఠశాలలో నేర్చుకొన్నదాని మీద ఉంటుంది. ఈ విభాగం యొక్క ఫలితాలు, మీకు ఆసక్తి కలిగివున్న రంగంలో కెరీర్‌ను ఎంచుకొనేందుకు ఏ అంశాలపై మీరు దృష్టి పెట్టాలన్నదాన్ని స్పష్టం చేస్తుంది.

అవగాహన పరీక్ష:

అవగాహనా పరీక్ష ఫలితాలు మీకు ఏ రంగంలో సహజ నైపుణ్యముందో తెలుపుతాయి. ప్రస్తుతం మీకున్న సహజ నైపుణ్యాలతో మీరు ఎంచుకొనే కెరీర్‌లో నైపుణ్యం ఇంకా ఎంత పెంచుకోవాలన్నది తెలుపుతుంది.

ఆసక్తి పరీక్ష:

మిమ్మల్ని సహజంగా కొన్ని రకాలైన వృత్తులు/పనులు కొన్ని ఉంటాయి. ఈ పరీక్ష మీరు ఎక్కువగా ఆనందించే పనుల జాబితాను తెలియజేస్తుంది.

వ్యక్తిత్వ పరీక్ష:

మీ వ్యక్తిత్వమనేది పాఠశాల స్థాయిలో ఒకరూపు దాల్చడం మొదలవుతుంది. మీ జీవితానుభవాలతో మీవ్యక్తిత్వం మారవచ్చు. మీకు ఉద్యోగంలో అధిక సంతృప్తినిచ్చేందుకు దీన్నిఉపయోగించుకోవచ్చు.ఇది ముఖ్యమేనా?


"అవును. ఇది చాలా ముఖ్యం. ఇది మీ ఆసక్తి మరియు నైపుణ్యాల ఆధారంగా మీకు సరిపోయే కెరీర్ ఐఛ్ఛికాలను ఎంచుకోవడానికి దోహదం చేయగలనందున ఈ పరీక్ష తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎలా? ఈ పరీక్ష మీ చదువు మరియు మీ కెరీర్ ఐఛ్ఛికాలను మీ నైపుణ్యాలు, ఇష్టాలు, అయిష్టాలు మరియు పరిజ్ఞాన స్థాయి ఆధారంగా ఉంటుంది"

పరీక్ష యొక్క వ్యవధి ఎంత? నేను ఒకే సిటింగ్‌లో పరీక్ష తీసుకోవాలా లేక వేర్వేరు రోజులలో తీసుకోవచ్చా?
ఈ పరీక్ష పూర్తిచేయడానికి మొత్తం ౨.౫ గంటల సమయం పడుతుంది. మీరు ఒకేరోజు పరీక్షను పూర్తిచేయమని మేము సిఫారసు చేస్తాము. అయితే, వేర్వేరు విభాగాలను మీరు వేర్వేరు సమయాల్లో తీసుకోవచ్చు. పరీక్షల మధ్యలో విరామం తీసుకొని, మీరు వేర్వేరు రోజులలో దీన్ని పూర్తిచేయవచ్చు. మీరు ఒక్కొవిభాగాన్ని పూర్తిచేసి దాఖలు పరచినప్పుడు, మీరు ఆ విభాగాన్ని మళ్ళీ తీసుకోనవసరం లేకుండా దాన్ని ’సేవ్’ చేయబడుతుంది. అయితే, మీకు పూర్తి నివేదిక కావాలంటే, మీరు పరీక్ష మొత్తం పూర్తి చేయవలసి ఉంటుంది.
నేను పరీక్షకు ఎలా నమోదు చేసుకోవాలి మరియు చెల్లింపు జరపాలి?

విద్యార్థులు డెబిట్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు జరపవచ్చు.
నేను పరీక్షకు ముందు సిద్ధం కావాలా?

ఈ పరీక్షకు హాజరవడానికి మీరు ఏవిధంగాను సిద్ధం కావలసిన అవసరం లేదు. ఈ పరీక్ష మీ ప్రస్తుత పరిజ్ఞాన స్థాయి, ఆసక్తి, సహజ సామర్థ్యాలు, మరియు వ్యక్తిత్వాలను అంచనా వేసేలా రూపొందించబడింది.
పరీక్షలోని అన్ని విభాగాలు ముఖ్యమైనవేనా లేక నేను ఏ విభాగాన్నైనా వదలివేయవచ్చా?
ఈ పరీక్షలోని అన్ని విభాగాలు ముఖ్యమైనవే. ఈ పరీక్షను తీవ్రంగా పరిగణించి, తీసుకొనే విద్యార్థుల ఫలితాలు ఖచ్చితంగా మరియు వారి ఆసక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా వచ్చే అవకాశం ఉంటుంది.


Explore career options through our blogs